దీనదయాళ్‌ జీవితం భావితరాలకు ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-26T08:05:18+05:30 IST

సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు, నిస్సహాయులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్జప్తి చేశారు. పండిట్‌ దీన్‌దయాళ్‌

దీనదయాళ్‌ జీవితం భావితరాలకు ఆదర్శం

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌


విజయవాడ (మొగల్రాజపురం), సెప్టెంబరు 25: సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు, నిస్సహాయులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్జప్తి చేశారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 107వ జయంతిని పురస్కరించుకుని పండిట్‌ దీన్‌దయాళ్‌ శ్రవణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వినికిడి సమస్య ఉన్న వారికి వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిఽధిగా పాల్గొన్న గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. దీనదయాళ్‌ ఉపాధ్యాయ జీవితం భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.  ఆయన్ను స్పూర్తిగా తీసుకుని వినికిడి లోపాలు ఉన్నవారికి వినికిడి యంత్రాలు ఇస్తున్న ఫౌండేషన్‌ను అభినందించారు. వినికిడి లోపాన్ని చిన్నతనంలోనే గుర్తించి సరైన చికిత్స చేయిస్తే నయం అవుతుందన్నారు.

Read more