నిరాడంబరంగా గవర్నర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-08-04T08:57:35+05:30 IST

నిరాడంబరంగా గవర్నర్‌ జన్మదిన వేడుకలు

నిరాడంబరంగా గవర్నర్‌ జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ 89వ జయంతి వేడుకలు అతి నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో విజయవాడలోని రాజ్‌భవన్‌లోకి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ఫోన్‌ ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హరిచందన్‌ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక సందేశం విడుదల చేస్తూ గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2022-08-04T08:57:35+05:30 IST