కనీస సౌకర్యాలు కరవయ్యాయి: గొల్లపల్లి
ABN , First Publish Date - 2022-10-17T10:18:37+05:30 IST
కనీస సౌకర్యాలు కరవయ్యాయి: గొల్లపల్లి
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కనీస సౌకర్యాలు సైతం కరవయిన రాష్ట్రం ఏదైన ఉందంటె అది అంధ్రప్రదేశ్ అనే దుస్థితికు రాష్ట్ర పరిస్థితి చేరుకుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు విమర్శించారు. ఆదివారం దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావడానికి తోడుగా కూల్చివేత చర్యలతో కొనసాగుతున్న విధ్వంసకర పాలన తుది దశకు చేరుకొందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఆరోగ్య యూనివర్సిటీ పేరును మార్చడంపై మండిపడ్డారు.