పదోన్నతులు ఇచ్చి పని భారం తగ్గించండి
ABN , First Publish Date - 2022-08-04T09:05:10+05:30 IST
పదోన్నతులు ఇచ్చి పని భారం తగ్గించండి
మంత్రి అంబటికి ఇంజనీర్ల సంఘం వినతి
విజయవాడ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించి పని భారాన్ని తగ్గించాలని ఆ శాఖ ఇంజనీర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, రాంబాబు, మల్లికార్జునరెడ్డి ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ఒక్కో ఇంజనీర్ రెండు నుంచి నాలుగు పోస్టులకు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా పనిభారం పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న వారికి ఆయా జోన్లలో ఉన్న వేతన స్కేలును అమలు చేయాలని కోరారు.