తెలంగాణకు వెళ్లే టీచర్ల వివరాలివ్వండి
ABN , First Publish Date - 2022-12-16T00:58:08+05:30 IST
అంతరాష్ట్ర బదిలీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లదలచిన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని డీఈవోలకు పాఠశాల ...
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అంతరాష్ట్ర బదిలీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లదలచిన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ పొందిన ఉపాధ్యాయుల వివరాలను ఈనెల 22లోగా ఇవ్వాలని స్పష్టంచేసింది.