గజకర్ణ విద్యలెందుకు సాయిరెడ్డీ?: లంకా దినకర్‌

ABN , First Publish Date - 2022-10-05T08:22:59+05:30 IST

గజకర్ణ విద్యలెందుకు సాయిరెడ్డీ?: లంకా దినకర్‌

గజకర్ణ విద్యలెందుకు సాయిరెడ్డీ?: లంకా దినకర్‌

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా  ప్రారంభమైన 5జీ నెట్‌ వర్క్‌ సేవలను ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతికి వీలైనంత త్వరగా ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కేంద్రాన్ని కోరుతూ టెలికమ్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ట్యాగ్‌ చేసి ట్విటర్‌లో పోస్టును బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ పెద్ద డ్రామాగా కొట్టి పారేశారు. ‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకొంటున్న మీరు ఆ 5జీ సేవలు కూడా తామే తెప్పించామన్నట్లు టక్కుటమార, గజకర్ణ విద్యలు రాష్ట్ర ప్రజలకు చెప్పడం సాధ్యమా?’ అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. సాయిరెడ్డికి చేతనైతే సీఎం జగన్‌ ఫొటోను రాష్ట్ర ప్రజల  భూమి హక్కుకు సంబంధించిన పాస్‌ పుస్తకాలపై తొలగించాలంటూ లేఖ రాస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు.


Read more