Ap Minister Jayaramకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-09-04T02:01:06+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మరో మంత్రి నిరసన సెగ తగిలింది. అస్పరి మండలం బినిగేరి గ్రామంలో నిర్వహించిన ‘గడప గడప’కు..

Ap Minister Jayaramకు నిరసన సెగ

కర్నూలు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (Gadapa Gadapaku Mana Prabhutvam)లో మరో మంత్రి నిరసన సెగ తగిలింది. అస్పరి మండలం బినిగేరి గ్రామంలో నిర్వహించిన ‘గడప గడప’కు కార్యక్రమంలో మంత్రి జయరాం (Minister Jayaram)కు ఓ యువకుడు గట్టి షాక్ ఇచ్చారు. తమ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఓ యువకుడు నిలదీశాడు. గ్రామ సర్పంచ్ అతనితో వాగ్వాదానికి దిగడంతో వారి మధ్య కాసేపు గొడవ జరిగింది. మంత్రి జయరాం కలుగజేసుకుని సమస్యలు తీర్చుతామని చెప్పడంతో గొడవ సర్దు మనిగింది. 



Read more