భోగాపురానికి జనవరిలో శంకుస్థాపన: అమర్‌నాథ్‌

ABN , First Publish Date - 2022-12-31T05:53:26+05:30 IST

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

భోగాపురానికి జనవరిలో శంకుస్థాపన: అమర్‌నాథ్‌

విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన శుక్రవా రం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.43 వేల కోట్లతో రాష్ట్రం లో ఏర్పాటు చేయబోయే సోలార్‌ ప్యానల్స్‌ పరిశ్రమకు కూడా వచ్చే నెలలోనే శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఐటీ, గ్రీన్‌ ఎనర్జీ, హ్యాండ్లూమ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారన్నారు.

Updated Date - 2022-12-31T05:53:27+05:30 IST