వైసీపీ మునిగిపోయే నావ

ABN , First Publish Date - 2022-05-30T08:56:29+05:30 IST

వైసీపీని ఇకపై బొక్క(జైలు)లో పార్టీ అని పిలుస్తామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. బొక్కలోకి వెళ్లింది వైసీపీ నాయకులే

వైసీపీ మునిగిపోయే నావ

ఇకపై దాన్ని బొక్కలో పార్టీ అని పిలుస్తాం

తల్లికి, చెల్లికి జగన్‌ వెన్నుపోటు: బుద్దా వెంకన్న


విజయవాడ(వన్‌టౌన్‌), మే 29: వైసీపీని ఇకపై బొక్క(జైలు)లో పార్టీ అని పిలుస్తామని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. బొక్కలోకి వెళ్లింది వైసీపీ నాయకులే కానీ, చంద్రబాబు వెళ్లలేదన్నది కొడాలి నాని తెలుసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2024లో వైసీపీ పూర్తిగా మునిగిపోతుందన్నారు. బొక్కలో ఉండి వచ్చిన తెల్ల గడ్డం విజయసాయిరెడ్డి, నల్ల గడ్డం కొడాలి నానిలకు మహానాడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైసీపీని మూసివేయడానికి ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే, ఆ రోజున జగన్‌ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి కాపాడిన సంగతి గుర్తుచేసుకోవాలన్నారు. వారిద్దరినీ జగన్‌ వెన్నుపోటు పొడిచారని తెలిపారు. చెల్లికి రాజ్యసభ సీటు ఎందుకు ఇవ్వలేదో జగన్‌ చెప్పాలన్నారు. సామాజిక న్యాయం బస్సుయాత్ర అంటూ మంత్రులు రోడ్లమీదకు వస్తుంటే ప్రజలు భయంతో పారిపోతున్నారన్నారు.

Read more