Tangirala sowmya: ఎన్టీఆర్‌ పేరును మార్చడాన్ని ఖండిస్తున్నా

ABN , First Publish Date - 2022-10-01T18:35:03+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

Tangirala sowmya: ఎన్టీఆర్‌ పేరును మార్చడాన్ని ఖండిస్తున్నా

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుని అవమానపరిచే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని... రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి కావడం వల్ల అన్ని వ్యవస్థలు ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నాయో చూస్తున్నామని అన్నారు.


ఎన్టీఆర్ పతనానికి కారణమే లక్ష్మి పార్వతి...

లక్ష్మి పార్వతి మాటలపైనా స్పందించిన సౌమ్య...  ఎన్టీఆర్ పతనానికి కారణమే లక్ష్మి పార్వతి అని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీ పతనం అవ్వకుండా ఉండేందుకు చంద్రబాబు ఆ పార్టీ పగ్గాలు తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్నారు కాబట్టే పార్టీ బ్రతికి ఉందని లేదంటే లక్ష్మి పార్వతి నీడలో పార్టీ కలిసిపోయేదని సౌమ్య వ్యాఖ్యలు చేశారు. 

Read more