సొంపెల్లి ప్రమాద ఘటనపై జవహర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-22T19:28:55+05:30 IST

సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సొంపెల్లి ప్రమాద ఘటనపై జవహర్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమగోదావరి: సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్(Jawahar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాదానికి ముందే విజయసాయిరెడ్డి(Vijayasaireddy) ట్వీట్ పెట్టడం అనుమానం కలిగిస్తోందని అన్నారు. సంఘటన జరగబోతుందని.. ఆ సంఘటనకు తమరు బలవుతారని ఏ విధంగా అన్నారని ప్రశ్నించారు. ‘‘ఆ ఘోరం జరుగుతుందని ముందే ఊహించారా.. లేక ఉద్దేశ్య పూర్వకంగా మీరే చేయించారా’’ అని అన్నారు. కర్మపాపం ఏదైనా ఉందంటే పాపులకు లేదా జగన్‌కు కర్మపాపం ఉంటుందన్నారు. అలిపిరి తరువాత చంద్రబాబుకు రెండో ఘటన జరిగిందని.. దేవుడు ఆయన పక్షాన ఉన్నారని ఆయన తెలిపారు. విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకి ఏమి కాదని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి మొరగడం మానేసి వరద బాధితులకు ఏవిధంగా సహాయం చేయాలో ఆలోచిస్తే మంచిదని హితవుపలికారు. ఆఖరిగా చంద్రబాబును, టీడీపీ నేతలను అంతమొందించే కుట్ర అస్త్రాలు సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు చంద్రబాబుని ఏమి చేయలేరని జవహర్ స్పష్టం చేశారు. 

Read more