Smart Meters : స్మార్ట్ మీటర్లకు మళ్లీ టెండర్లు!
ABN , First Publish Date - 2022-12-18T02:34:19+05:30 IST
ప్రతిపాదిత స్మార్ట్ మీటర్, యాజమాన్య నిర్వహణ చార్జీలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు వెనక్కి తగ్గింది. సహేతుకమైన మదింపుతో మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వం డిస్కమ్‌లను ఆదేశించినట్టు ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి.
మీటరు, నిర్వహణ భారీ చార్జీలపై తీవ్ర వ్యతిరేకత
డిస్కమ్‌లు పిలిచిన టెండర్లు రద్దు!
తమిళనాడులో మొత్తం ఖర్చు రూ.12,500
రాష్ట్రంలో మాత్రం రూ.35,000గా నిర్ధారణ
అక్టోబరులో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం
ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గిన డిస్కమ్‌లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రతిపాదిత స్మార్ట్ మీటర్, యాజమాన్య నిర్వహణ చార్జీలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు వెనక్కి తగ్గింది. సహేతుకమైన మదింపుతో మళ్లీ టెండర్లు పిలవాలని ప్రభుత్వం డిస్కమ్‌లను ఆదేశించినట్టు ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో స్మార్ట్ మీటర్ల కోసం మళ్లీ టెండర్లు పిలిచేందుకు డిస్కమ్‌లు సమాయత్తమవుతున్నాయని తెలిపాయి. అక్టోబరు 31న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘తంబీల మీటరు రొంబా స్మార్టు’ కథనంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మీటరుకు రూ.3 వేలు, నిర్వహణకు రూ.9,500 కలిపి మొత్తం రూ.12,500కే సేవలు అందిస్తున్నారని వెల్లడించింది. పైగా మీటర్ల ఖర్చును ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టు పేర్కొంది. తమిళనాడు మాదిరిగా ఏపీలో అదే స్మార్ట్ మీట రు స్కీమ్ అయినా.. మీటరు ధర రూ.6 వేలు, నిర్వహణ వ్యయం రూ.29 వేలు కలిపి డిస్కమ్‌లు మొత్తం రూ.35 వేలు ఖర్చు చేస్తున్న వైనాన్ని ఎండగట్టింది. తమిళనాడు కంటే ఏపీలో మూడు రెట్లు పెరిగినట్టు ‘ఆంధ్రజ్యోతి’ సవివరంగా వెల్లడించింది. సర్కారు నిర్ణయంపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అస్మదీయుల కోసం టెండర్లు పిలిచేందుకు డిస్కమ్‌లు సన్నద్ధం కావడంపై విద్యుత్ రంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు.
టెండర్లు పిలిచేందుకు డీపీఆర్ తయారు చేసిన డిస్కమ్‌లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎ్‌సఎల్‌ను ఎందుకు సంప్రదించలేదనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. టెండర్లు పిలవకముందే స్మార్ట్ మీటరు ధర రూ.6,000, యాజమాన్య నిర్వహణ వ్యయం రూ.29,000గా నిర్ధారించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలవనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 3 డిస్కమ్‌లు ఇప్పటికే టెండర్లు పిలిచాయి. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.793 కోట్ల అంచనా వ్యయంతో టెం డర్లు పిలిచారు. అలాగే ఏపీఎస్సీడీసీఎల్ పరిధిలో రూ.528 కోట్లతో ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను మార్చడానికి టెండర్లు పిలిచారు. ఇక ఈపీడీసీఎల్ పరిధిలో రూ.729 కోట్లతో టెండర్లు పిలిచారు. మరోవైపు ప్రభుత్వం కూడా భారీ ధరల విషయంపై డిస్కమ్‌లను ప్రశ్నించింది. దీంతో ఈ ఏడాది అక్టోబరు 21వ తేదీతో టెండర్లను ఖరారు చేయాల్సి ఉన్నా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రుణం కోసం పాట్లు
స్మార్ట్ మీటర్లకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం ముందుగా ఇచ్చాకే టెండర్లు పిలవాలని డిస్కమ్‌లకు ఏపీఈఆర్‌సీ నిర్దేశించింది. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూ డా రాలేదు. ప్రభుత్వం తరఫున రుణం కోసం డిస్కమ్‌లు ఆర్థిక సంస్థలను సంప్రదించాయి. డిస్కమ్‌ల ప్రతిపాదనలు చూశాక ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు తిరస్కరించింద ని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆర్‌ఈసీ నుం చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్‌ఫసీ) రూ.36,000 కోట్ల రు ణం తీసుకుని డిస్కమ్‌లకు 11.5ు వడ్డీకి అప్పుగా ఇచ్చే ప్ర క్రియ నడుస్తోందని చెబుతున్నాయి. ఇదే జరిగితే డిస్కమ్‌లు కుదేలవడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా డిస్కమ్‌లు వేల కోట్ల రూపాయల రుణాన్ని పీఎ్‌ఫసీ నుంచి తీసుకుంటే భవిష్యత్తులో మోయలేని భారమవుతుందని హెచ్చరిస్తున్నారు.
టెండర్లకు తొందర ఎందుకో?
ఏపీఈఆర్‌సీ విడుదల చేసిన వార్షిక ఆదాయ నివేదికలో నెలకు 500 యూనిట్లకుపైగా వాడే వినియోగదారులు స్మార్ట్ మీటర్లను ఎంపిక చేసుకునే వీలుందని ప్రకటించింది. ఎంపి క స్వేచ్ఛను వినియోగదారులకే ఇచ్చింది. గతంలో 200 యూనిట్లకు పైగా వాడే వినియోగదారులందరికీ స్మార్ట్ మీట ర్లు బిగిస్తామన్న డిస్కమ్‌లు.. ఇప్పుడు 500 యూనిట్లకు పైగా వాడే వారికేనని వెల్లడిస్తున్నాయి. అలాంటప్పుడు స్మార్ట్ మీటర్ల బిగింపు కోసం మళ్లీ టెండర్లు పిలిచేందుకు డిస్కమ్‌లు ఎందుకు తొందరపడుతున్నాయని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.