పాస్‌పోర్టు పోలీసు క్లియరెన్స్‌ కోసం ఇక పోస్టాఫీస్‌ల్లోనూ దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-09-28T08:21:06+05:30 IST

పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో కూడా పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డీఎ్‌సఎస్‌ శ్రీనివాసరావు చెప్పారు.

పాస్‌పోర్టు  పోలీసు క్లియరెన్స్‌ కోసం ఇక పోస్టాఫీస్‌ల్లోనూ దరఖాస్తులు

ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి  శ్రీనివాసరావు ప్రకటన


విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో కూడా పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డీఎ్‌సఎస్‌ శ్రీనివాసరావు చెప్పారు.  పోలీసు క్లియరెన్స్‌ల కోసం ఊహించనంతగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేవలను సులభతరం చేసిందన్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు, గుడివాడ, కర్నూలులో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. స్లాట్‌ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి పోలీసు శాఖ అధికారులను సంప్రతించి కేవలం ఐదు రోజుల లోపే పీసీసీలను జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఈ నిర్ణయం విదేశాలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలనుకునేవారికి, విదేశీనభ్యసించేవారికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ల కోసం ఏజెంట్లను సంప్రతించి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

Read more