కృష్ణా జిల్లాలో మరో ఉద్దానం

ABN , First Publish Date - 2022-02-23T08:45:35+05:30 IST

కృష్ణా జిల్లాలోని 15 మండలాల్లో కిడ్నీ వ్యాధి విస్తరించిందని, ఒక్క ఎ.కొండూరు మండలంలోనే పదిరోజుల్లో ఐదుగురు మృతి చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తెలిపారు

కృష్ణా జిల్లాలో మరో ఉద్దానం

ఎ.కొండూరులో పది రోజుల్లో ఐదుగురి మృతి 


ఎ.కొండూరు, ఫిబ్రవరి 22 : కృష్ణా జిల్లాలోని 15 మండలాల్లో కిడ్నీ వ్యాధి విస్తరించిందని, ఒక్క ఎ.కొండూరు మండలంలోనే పదిరోజుల్లో ఐదుగురు మృతి చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తెలిపారు. కిడ్నీ సమస్యపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండలంలోని ప్రతి గ్రామంలో కిడ్నీ రోగులు ఉన్నారని, దీప్లానగర్‌ తండాలో 150 కుటుంబాలు ఉంటే గత మూడేళ్లలో 16 మంది మృతి చెందారని తెలిపారు. ఫ్లోరైడ్‌ నీటి వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతోందన్నారు.  

Read more