ఎర్రచందనం దుంగల వాహనం పట్టివేత

ABN , First Publish Date - 2022-11-24T23:51:36+05:30 IST

కడప నుంచి ఆళ్లగడ్డ మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగల వాహనాన్ని గురువారం నల్లగట్ల వద్ద రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఎర్రచందనం దుంగల వాహనం పట్టివేత

ఆళ్లగడ్డ, నవంబరు 24: కడప నుంచి ఆళ్లగడ్డ మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగల వాహనాన్ని గురువారం నల్లగట్ల వద్ద రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. కడప టాస్క్‌ఫోర్స్‌ అధికారులను తప్పించుకొని నంద్యాలకు వెళ్తున్న వాహనం సమాచారాన్ని రూరల్‌ పోలీసులకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఈ మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకొని కడప టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు అప్పగించారు. వాహనంలో భారాగా ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి కేసును నమోదు చేయలేదని రూరల్‌ సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు.

.

Updated Date - 2022-11-24T23:51:37+05:30 IST