సముద్రంపై మత్స్యకారుల ఘర్షణ
ABN , First Publish Date - 2022-01-05T09:07:56+05:30 IST
రింగ్ వలలతో వేట విషయమై విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా
విశాఖపట్నం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రింగ్ వలలతో వేట విషయమై విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా, తీరానికి సమీపాన రింగ్ వలలతో చేపలు వేటాడుతున్నారంటూ సంప్రదాయ మత్స్యకారులు అవతల వర్గంపై మంగళవారం ఉదయం దాడికి దిగారు. ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక బోటు దగ్ధమైంది. గాయపడినవారిని పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. జాలరిపేట, వాసవానిపాలెం, మంగమారిపేటల్లో 144వ సెక్షన్ విధించారు. ఇరువర్గాలు సంయమనం పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు.