Yash meet Lokesh: లోకేశ్‌ను కలిసిన సినీ హీరో యశ్‌

ABN , First Publish Date - 2022-12-16T00:25:28+05:30 IST

కన్నడ సినీ హీరో యశ్‌ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు.

Yash meet Lokesh: లోకేశ్‌ను కలిసిన సినీ హీరో యశ్‌

మర్యాదపూర్వక భేటీ అంటున్న పార్టీ వర్గాలు

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కన్నడ సినీ హీరో యశ్‌ హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. లోకేశ్‌ నివాసంలో గురువారం వారి భేటీ జరిగింది. కేజీఎఫ్‌ 1, 2 సినిమాల విజయంతో అందులో హీరోగా నటించిన యశ్‌ పేరు ఇటీవలి కాలంలో మారుమోగిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని హసన్‌ యశ్‌ స్వస్థలం. వ్యక్తిగత పనిపై హైదరాబాద్‌ వచ్చిన యశ్‌ తన మిత్రుడు ఒకరు లోకేశ్‌ వద్దకు వెళ్తుండటంతో తాను కూడా వెళ్లారని సమాచారం. పరస్పర పరిచయం కోసం జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఇద్దరికీ బాగా పరిచయం ఉన్న మిత్రుడి ద్వారా వారు కలుసుకొన్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సుమారు అరగంట పాటు వారు పరస్పర ఆసక్తి ఉన్న విషయాలపై మాట్లాడుకొన్నారు.

Updated Date - 2022-12-16T00:25:29+05:30 IST