AP News: కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి యావజ్జీవం
ABN , First Publish Date - 2022-12-16T19:32:58+05:30 IST
Guntur: కూతురిపై అత్యాచారం కేసులో తండ్రికి యావజ్జీవం నాగరాజు అనే వ్యక్తి తన కూతురుపై అత్యాచారానికి పాల్పడడంతో బాధితురాలు అవమానంతో
Guntur: నాగరాజు అనే వ్యక్తి తన కూతురుపై అత్యాచారానికి పాల్పడడంతో బాధితురాలు అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 2017లో గుంటూరులో జరిగింది. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తర్వాత రెండేళ్లు నాగరాజు పరారీలో ఉన్నాడు. 2020లో పోలీసులు పట్టుకున్నారు. కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారలను విచారించిన అనంతరం ప్రత్యేక ఫోక్సో కేసుల న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. నిందితుడు నాగరాజుకు యావజ్జీవ శిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది.