ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు..ఐదుగురు మహిళలు సజీవదహనం

ABN , First Publish Date - 2022-06-30T13:27:50+05:30 IST

సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో హైటెన్షన్ మంటల్లో కాలి

ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు..ఐదుగురు మహిళలు సజీవదహనం

సత్యసాయి జిల్లా:  సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినవారంతా మహిళలేగా పోలీసులు గుర్తించారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-30T13:27:50+05:30 IST