సున్నoబట్టి వీధిలో పేలిన గ్యాస్ సిలిండర్..రూ. 5 లక్షల ఆస్తినష్టం

ABN , First Publish Date - 2022-06-29T13:41:54+05:30 IST

మ్మిగనూరు సున్నంబట్టి వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున్న ఎగిసిపడ్డాయి. మంటల్లో మూడు దుకాణాలు

సున్నoబట్టి వీధిలో పేలిన గ్యాస్ సిలిండర్..రూ. 5 లక్షల ఆస్తినష్టం

కర్నూలు: ఎమ్మిగనూరు సున్నంబట్టి వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున్న ఎగిసిపడ్డాయి. మంటల్లో మూడు దుకాణాలు దగ్ధం అయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సుమారుగా రూ. ఐదు లక్షలు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-29T13:41:54+05:30 IST