గూప్‌1లో 3 సెక్షన్లుగా వ్యాసరూప ప్రశ్నలు

ABN , First Publish Date - 2022-12-07T02:51:08+05:30 IST

ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి పేపర్‌-1 పరీక్షలో సాధారణ వ్యాసరూప ప్రశ్నలపై ఏపీపీఎస్సీ వివరణ ఇచ్చింది.

గూప్‌1లో 3 సెక్షన్లుగా వ్యాసరూప ప్రశ్నలు

ప్యాట్రన్‌లో ఏపీపీఎస్సీ మార్పులు

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి పేపర్‌-1 పరీక్షలో సాధారణ వ్యాసరూప ప్రశ్నలపై ఏపీపీఎస్సీ వివరణ ఇచ్చింది. కరెంట్‌ అఫైర్స్‌, సోషియో-పొలిటికల్‌, సోషియో-ఎకనమిక్‌, సోషియో-పర్యావరణం, సాంస్కృతిక-చారిత్రాత్మక సంఘటనలు, పౌర అవగాహన, రెఫ్లెక్టివ్‌ అంశాలు.. ఇలా 7 అంశాలుంటాయని తెలిపింది. అయితే ఇప్పుడు వీటిని మూడు సెక్షన్ల కింద విభజించారు. కరెంట్‌ అఫైర్స్‌ ఒక సెక్షన్‌లో, తర్వాత ఆరు అంశాలు రెండు సెక్షన్లలో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌ నుంచి ఒక్కో ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కో ప్రశ్న 50 మార్కులు, 180 నిమిషాల సమయం ఉంటుందని వివరించింది.

Updated Date - 2022-12-07T02:51:09+05:30 IST