ఏడుకొండలెక్కిన ‘ఎలక్ర్టిక్‌ బస్సు’

ABN , First Publish Date - 2022-09-20T08:56:49+05:30 IST

తిరుమలకు ఎలక్ర్టిక్‌ బస్సును సోమవారం ఉదయం ప్రయోగాత్మకంగా నడిపారు. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్‌

ఏడుకొండలెక్కిన ‘ఎలక్ర్టిక్‌ బస్సు’

తిరుమల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు ఎలక్ర్టిక్‌ బస్సును సోమవారం ఉదయం ప్రయోగాత్మకంగా నడిపారు. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్‌ మీదుగా కొండపైకి వెళ్లింది. తర్వాత తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి.. తిరిగి మొదటి ఘాట్‌ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది.  మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు.  వారం రోజుల్లో మరో పది బస్సులు రానున్నాయని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Read more