వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: Nagababu
ABN , First Publish Date - 2022-06-03T21:21:59+05:30 IST
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు (Nagababu) ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విశాఖ: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు (Nagababu) ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని వెల్లడించారు. పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలిపారు. పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని నాగబాబు స్పష్టం చేశారు.