ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు: మంత్రి ఆదిమూలపు
ABN , First Publish Date - 2022-04-29T00:43:09+05:30 IST
రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని పురపాలక

విశాఖపట్నం: రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులను వేయడాన్ని మంత్రి సమర్థించారు. పత్రికలలో టిడ్కో ఇళ్లపై నిరాధారమైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. ఇలాంటి విమర్శలకు ప్రజలే సమాధానం చెప్తారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో 5 లక్షలు ఇల్లు కడతామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. 3 లక్షల 13 ఇళ్ళ నిర్మాణం జరిగితే ఎక్కడా 10 శాతం కన్నా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాదిలోగా దశల వారీగా 2 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామమని ఆయన తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో మార్పు ఉండదన్నారు. కొత్త వారు కూడా ఈ పథకానికి అర్హులవుతారని మంత్రి తెలిపారు.