-
-
Home » Andhra Pradesh » dwaraka tirumala china venkanna temple eluru andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Ap News: చినవెంకన్న ఆలయంలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-10-11T19:54:37+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది.

ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. ధర్మ అప్పారాయ నిలయం దగ్గర షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. రూమ్ నెంబర్ 48లో ఏసీ నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా... ప్రమాద సమయంలో రూంలో భక్తులు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.