AP News: చంద్రబాబు హయాంలో ఎక్కువ ఎకరాలకు సాగునీరు.. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-10-12T02:29:34+05:30 IST

అమరావతి: జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.488 కోట్లు ఖర్చు చేసి 11,649 ఎకరాలకు మాత్రమే సాగునీరందించగా..

AP News: చంద్రబాబు హయాంలో ఎక్కువ ఎకరాలకు సాగునీరు.. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి

అమరావతి: జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.488 కోట్లు ఖర్చు చేసి 11,649 ఎకరాలకు మాత్రమే సాగునీరందించగా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,571 కోట్లు ఖర్చు చేసి 69వేల ఎకరాలకు సాగునీరందించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు రూ.1,539 కోట్లు ఖర్చు చేసి 89,200 ఎకరాలకు సాగునీరు అందించిందని వివరించారు. ఉత్తరాంధ్ర విషయంలో జగన్‌ సర్కార్ చిన్న చూపు చూసిందని నారాయణరెడ్డి చెప్పారు. 


వారి మాటలు అశాస్త్రీయం

‘‘పోలవరం ప్రాజెక్ట్‌లో మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరలో పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల్లో..తెలంగాణ, ఒడిశా అధికారులు అశాస్త్రీయంగా మాట్లాడారు. బ్యాక్‌వాటర్ రాకుండా మరో రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టాలని తెలంగాణ చెప్పింది. ప్రొటెక్షన్ బండ్‌కు రూ.700కోట్లు ఖర్చు అవుతుందని ఒడిశా చెబుతోంది. ప్రొటెక్షన్ బండ్ నిర్మాణంతో బ్యాక్‌వాటర్ పెరగదు’’ అని చెప్పారు. 


ప్రభుత్వ వైఫల్యాల వల్లే..

‘‘పులివెందులకు నేను నీరందిస్తే క్రెడిట్ చాలా మంది తీసుకున్నారు. ఏపీలో పదేళ్ల ముందు ప్రారంభమైన ప్రాజెక్ట్..ప్రభుత్వ వైఫల్యాలతో పూర్తి కాలేదు. ఇప్పుడు కొత్త అంచనాలు వేయాలి.. ఎస్టిమేషన్ పెంచాలి’’ అంటూ పోలవరం, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిని నారాయణరెడ్డి వివరించారు.

Updated Date - 2022-10-12T02:29:34+05:30 IST