25న బెజవాడ దుర్గమ్మ ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2022-10-08T19:42:57+05:30 IST
ఈ నెల 25న ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. 25వ తేదీ ఉదయం
విజయవాడ : ఈ నెల 25న ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఆ రోజున ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నారు. మరుసటి రోజు 26వ తేదీన అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది.