Dhulipalla trust స్వాధీనానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు
ABN , First Publish Date - 2022-06-25T15:12:43+05:30 IST
దూళిపాళ్ల వీరయ్య చౌదరి (Dhulipalla virayya chaudhary) మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం(Government) ప్రయత్నాలు చేస్తోంది.

అమరావతి: దూళిపాళ్ల వీరయ్య చౌదరి (Dhulipalla virayya chaudhary) మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం (Government) ప్రయత్నాలు చేస్తోంది. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్టుకు తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ట్రస్ట్ దేవాదాయ చట్టం పరిధిలోకి రాదని హైకోర్టు డివిజినల్ బెంచిలో ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ అప్పీల్ చేసింది. తమ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆసుపత్రి సంగం డైరీ పాల ఉత్పత్తి దారుల కుటుంబాలకు సేవ చేస్తోందని ట్రస్ట్ యాజమాన్యం పేర్కొంది. గత వాయిదా సందర్భంగా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు చేసింది. అయినప్పటికీ అధికారులు చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం ట్రస్టు స్వాధీనానికి ఈరోజు నోటీసులు జారీచేసింది. కోర్టు తీర్పుకు లోబడి ప్రక్రియ ఉంటుందని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపారు. నరేంద్రకు దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు పంపించారు.