తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-23T01:06:06+05:30 IST

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన విషయం తెలిసిందే.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన విషయం తెలిసిందే. వరుస సెలవులతో పాటు వారాంతాలు కావడంలో కొండ కిక్కిరిసిపోయింది. అయితే ఆదివారం నుంచి గురువారం వరకు భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో వుండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి భక్తుల రాక పెరిగింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 30 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని రెండు షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. భక్తులకు దాదాపు 25 గంటల దర్శన సమయం పడుతోంది. శనివారం ఉదయానికి అన్ని కంపార్టుమెంట్లు, షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్‌ వెలుపలకు వచ్చే అవకాశముండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. కంపార్టుమెంట్లు, షెడ్లు, క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారు. మరోవైపు తిరుమలలో గదులకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. గది పొందేందుకు రెండుమూడు గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. కల్యాణకట్టలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు భక్తులతో సందడిగా కనిపిస్తున్నాయి. 


Updated Date - 2022-04-23T01:06:06+05:30 IST