జగన్ చేతులెత్తేశారు.. మరో ఎనిమిది నెలలే: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-03-17T00:43:20+05:30 IST

అభివృద్ధి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మరో ఎనిమిది నెలలే ఈ ప్రభుత్వం ఉంటుందని..

జగన్ చేతులెత్తేశారు.. మరో ఎనిమిది నెలలే: దేవినేని ఉమ

కృష్ణా: అభివృద్ధి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మరో ఎనిమిది నెలలే ఈ ప్రభుత్వం ఉంటుందని సీఎం డొల్లతనం మాటల్లో బయటపడిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలని గడిపా గడపకి వెళ్ళమంటున్నారని,  ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వేదికని కూల్చినప్పుడే వైసీపీ సర్కార్‌కు కాలం బలీయమైందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. వైసీపీ టైం అయిపోయిందని, ఇక నుంచి ప్రతిపక్షాల టైమ్ అని దేవినేని ఉమ అన్నారు. 


Read more