Devineni uma: ఓటరు జాబితాలో అవకతవకలపై ఈసీకి దేవినేని ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-08-13T18:59:35+05:30 IST
ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయాలంటూ ఎన్నికల కమీషన్‌కు మాజీ మంత్రి దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయాలంటూ ఎన్నికల కమిషన్ (EC)కు మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni uma) ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజులుగా గొల్లపూడి 265 బూత్ పరిధిలో దేవినేని ఉమా పర్యటిస్తున్నారు. ఓటు జాబితాలో తన దృష్టికి వచ్చిన అవకతవకలను మాజీ మంత్రి మంత్రి లేఖలో పొందుపరచారు. విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి సచివాలయం -2లో లేఖను అందజేసిన నేతలు... గోడ వద్ద లేఖ ప్రతిని అంటించారు. ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఈఆర్వో వెంటనే స్పందించి ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయమని దేవినే ఉమా విజ్ఞప్తి చేశారు.