చలో విజయవాడకు అనుమతి నిరాకరణ
ABN , First Publish Date - 2022-02-02T23:02:06+05:30 IST
పీఆర్సీపై ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడకు పోలీసులు అనుమతిని
అమరావతి: పీఆర్సీపై ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. చలో విజయవాడపై మళ్లీ నగర పోలీస్ కమిషనర్‌తో చర్చలు జరుగుతున్నాయి. మధ్యేమార్గంగా చలో విజయవాడ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్జీఓ నేత విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్‌తో స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ అవనున్నారు. సంఖ్య తగ్గించుకొని చలో విజయవాడ నిర్వహించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా విజయవాడకు ఉద్యోగులు చేరుకుంటున్నారు.