మున్సిపల్‌ హెచ్‌ఎంలకు డీడీవో అధికారాలివ్వాలి

ABN , First Publish Date - 2022-07-05T08:08:11+05:30 IST

మున్సిపల్‌ హెచ్‌ఎంలకు డీడీవో అధికారాలివ్వాలి

మున్సిపల్‌ హెచ్‌ఎంలకు డీడీవో అధికారాలివ్వాలి

మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖలోకి తీసుకొచ్చినందున ఉపాధ్యాయుల జీతాల బిల్లులకు ఇబ్బంది లేకుండా హెచ్‌ఎంలకు డీడీవో అధికారాలు ఇవ్వాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల పర్యవేక్షణకు మంజూరు చేసిన ఉప విద్యాశాఖాధికారి పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు. కాగా, టైంస్కేలు ప్రాతిపదికన ప్రభుత్వపాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు యథావిథిగా విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.  

Read more