దస్తగిరి మాత్రమే ప్రత్యక్ష సాక్షి: హైకోర్టు

ABN , First Publish Date - 2022-02-16T23:07:05+05:30 IST

దస్తగిరి మాత్రమే వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని

దస్తగిరి మాత్రమే ప్రత్యక్ష సాక్షి: హైకోర్టు

కడప: దస్తగిరి మాత్రమే వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని హైకోర్టు పేర్కొంది. వైఎస్‌ వివేకా హత్య కేసులో వివేకా డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్నిసవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. దస్తగిరి వ్యవహారంపై కడప కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 


వివేకాందరెడ్డి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐకి దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ నిందితులు ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి వేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. సీబీఐకి దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు.. అనుమతించడాన్ని ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాలను కొట్టివేసింది. కాగా దస్తగిరి నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్యకు జరిగిన కుట్రను దస్తగిరి వివరించారు.

Read more