పట్టాల రద్దుపై దళితుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-08T09:27:39+05:30 IST

పట్టాల రద్దుపై దళితుల ఆగ్రహం

పట్టాల రద్దుపై దళితుల ఆగ్రహం

రాప్తాడు ఎమ్మెల్యేపై బి.యాలేరులో ఆగ్రహం

ఆత్మకూరు, అకోబరు 7: టీడీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి, అగ్రవర్ణాలకు ఇస్తారా? అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బి.యాలేరు గ్రామ దళితులు విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరులో టీడీపీ కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు శుక్రవారం దళితులు ప్రయత్నించారు. వారిని రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పట్టాల రద్దును నిరసిస్తూ.. దళితులంతా తహసీల్దారు జీపు ముందు బైఠాయించారు. టీడీపీ హయాంలో 246 మందికి పట్టాలు మంజూరయ్యాయని, వైసీపీ రాగానే వాటిని రద్దు చేసిందని చెప్పారు. స్థలాల సమస్యపై రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. న్యాయం చేస్తామని తహసీల్దారు నాగభూషణం హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు.

Read more