కోలగట్ల ర్యాలీలో అపశ్రుతి

ABN , First Publish Date - 2022-09-26T08:09:22+05:30 IST

వందలాది బైక్‌లు, కార్లతో ర్యాలీ.. పైనుంచి హెలికాప్టర్‌తో పూలు.. ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం విజయనగరానికి వచ్చిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగతం

కోలగట్ల ర్యాలీలో అపశ్రుతి

హెలికాప్టర్‌ తగిలి కిందపడిన కటౌట్‌

ఒకరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు


విజయనగరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వందలాది బైక్‌లు, కార్లతో ర్యాలీ.. పైనుంచి హెలికాప్టర్‌తో పూలు.. ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం విజయనగరానికి వచ్చిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు చేసిన హడావిడి ఇది! ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. వీరభద్రస్వామిపై పూలు జల్లేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌ బాగా తక్కువ ఎత్తులో ఎగరడంతో అక్కడున్న కటౌట్‌కు తగిలింది. దీంతో ఆ కటౌట్‌ ఒక కార్యకర్తపై పడింది. ఆయనకు గాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా.. నగర శివార్లలోని చెల్లూరు నుంచి ర్యాలీ ప్రారంభమై గంటలకొద్దీ సాగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్‌ దెబ్బకు దుమ్ము, ధూళి లేచి ర్యాలీకి వచ్చిన వారి కళ్లలో పడింది. దీంతో వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.

Read more