సీపీఎస్‌.. కాదుకాదు.. పెండింగ్‌!

ABN , First Publish Date - 2022-12-07T02:30:48+05:30 IST

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహణపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. సీపీఎ్‌సపై చర్చించాలని పిలిచినా, ఉద్యోగులు ససేమిరా అనడంతో మాట మార్చి, వారిని ఏమార్చే ప్రయత్నం చేసింది.

సీపీఎస్‌.. కాదుకాదు.. పెండింగ్‌!

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహణపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. సీపీఎ్‌సపై చర్చించాలని పిలిచినా, ఉద్యోగులు ససేమిరా అనడంతో మాట మార్చి, వారిని ఏమార్చే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు రాలేదంటే ప్రజల్లో వ్యతిరేక భావన ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వ పెద్దలు వ్యూహం మార్చేశారు. సీపీఎ్‌సపై కాదు పెండింగు సమస్యలపై చర్చించేందుకే పిలుస్తున్నామని మంత్రుల కమిటీ సెలవిచ్చింది. ‘ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం’ అనే ముద్ర చెరిపి వేసుకోవడానికి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ నుంచి ఆహ్వానం అందింది. సీపీఎ్‌సపై మంత్రుల కమిటీతో విజయవాడలో మంగళవారం సమావేశం జరుగుతుందని.. హాజరుకావాలని పేర్కొంది. సంఘాల నాయకులు మాత్రం తాము ఓపీఎ్‌సకే కట్టుబడి ఉన్నామని సమావేశానికి హాజరయ్యేదిలేదని తేల్చిచెప్పారు. ఏపీ జేఏసీ అమరావతి సహా సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలైన ఏపీసీపీఎ్‌సయూఎస్‌, ఏపీసీపీఎ్‌సఈఏ, ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎ్‌ఫలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. సమస్య పరిష్కారం మాట ఎలా ఉన్నా కనీసం తాము నిర్వహించే సమావేశానికి ఉద్యోగ సంఘాలను కూడా రప్పించలేకపోతే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందింది.

వెంటనే మాట మార్చి.. సీపీఎస్తోపాటు పెండింగ్‌ సమస్యలపైనా చర్చ జరుగుతుందని, రావాలని సంఘాల నేతలకు మంగళవారం సమావేశం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మరో సందేశం పంపింది. దీంతో ఏపీ జేఏసీ అమరావతి సహా మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల నేతలు హాజరయ్యాయి. అయితే, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు రెండు, ఏపీటీఎఫ్‌ మూడు సంఘాలు మాత్రం రాలేదు. కాగా.. సమావేశం విజయవాడలో జరుగుతుందని మొదట చెప్పిన ప్రభుత్వం.. మాటమార్చి అమరావతి సచివాలయానికి మార్చింది. ‘‘అధికారులు పొరపాటున సీపీఎ్‌సపై సమాచారం ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపైనే చర్చించడానికి పిలిచాం’’ అని సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్టు తెలిసింది. ఇక సీపీఎస్‌, జీపీఎస్‌ అనే పదాలు కాకుండా పెన్షన్‌ విధానంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. రెండు సీపీఎస్‌ సంఘాలు సమావేశానికి రాకపోవడంతో ఆ విషయంపై చర్చను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు సమావేశంలో చెప్పినట్టు తెలిసింది.

అందుకే బహిష్కరించాం: ఏపీసీపీఎ్‌సయూఎస్‌

ప్రభుత్వం ఓపీఎ్‌సపై స్పష్టత ఇవ్వలేదని అందుకే మంత్రుల కమిటీ సమావేశాన్ని బహిష్కరించామని ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు చింతగుంట్ల మరియదాస్‌ తెలిపారు. ప్రభుత్వం చేసిన జీపీఎస్‌ ప్రతిపాదనలను తాము ఇది వరకే తిరస్కరించామన్నారు.

సాచివేత ధోరణి సహించలేకే: ఏపీసీపీఎస్ఈఏ

పాత పెన్షన్‌ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం సాచివేత ధోరణిని సహించలేకే మంత్రుల కమిటీ సమావేశాన్ని బహిష్కరించినట్టు ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు రొంగల అప్పలరాజు తెలిపారు. జీపీఎ్‌సపై గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో సాగదీసిందన్నారు.

ఓపీఎస్ కు చర్చలు అవసరంలేదు: ఏపీటీఎఫ్‌

ప్రభుత్వానికి ఓపీఎస్‌ అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చర్చలు అవసరం లేదని, దానిని అమలు చేయొచ్చని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు తెలిపారు. గతంలోనే తాము ఓపీఎ్‌సకు జీపీఎస్‌ ప్రత్యామ్నాయం కాదని తెలిపామన్నారు. సర్కారు వైఖరికి నిరసనగానే మంత్రుల కమిటీ సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు.

Updated Date - 2022-12-07T02:30:49+05:30 IST