ఏపీ సచివాలయంలో సీపీఎస్‌ అసోసియేషన్‌

ABN , First Publish Date - 2022-09-23T08:46:16+05:30 IST

ఏపీ సచివాలయంలో సీపీఎస్‌ అసోసియేషన్‌

ఏపీ సచివాలయంలో సీపీఎస్‌ అసోసియేషన్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో ఏపీ సచివాలయం సీపీఎస్‌ అసోసియేషన్‌ ఏర్పాటైంది. ఈ సంఘానికి తాత్కాలిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కోట్ల రాజేశ్‌, ఏ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా నాపా ప్రసాద్‌, ఉపాధ్యక్షురాలిగా మాధవీలతతోపాటు మరో 11 మంది సభ్యులతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గురువారం అమరావతి సచివాలయంలో 5వ బ్లాకులో సచివాలయంలోని సీపీఎస్‌ ఉద్యోగుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్న సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణతో, సీపీఎస్‌ సమస్యలపై పోరాడటానికి , రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా కోట్ల రాజేశ్‌ అధ్యక్షతన 12 మంది సభ్యులతో తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాజేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు, సీపీఎస్‌ సంఘాలను కలుపుకుని ఉమ్మడి కార్యాచరణతో పోరాటం కొనసాగిస్తామని అన్నారు.


Updated Date - 2022-09-23T08:46:16+05:30 IST