ఏపీ అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-01-03T14:49:02+05:30 IST

రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఏపీ అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: Ramakrishna

అమరావతి: రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ అప్పులు, ఖర్చుల లెక్కలు రాశామని చెబుతున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న బుగ్గన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నాడు తప్పయిన అప్పు, ఇప్పుడు ఒప్పయ్యిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఉన్న అప్పు, తెలుగుదేశం హయాంలో చేసిన అప్పులు, తదుపరి వైసీపీ ఇప్పటి వరకు చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Read more