AP టౌన్ ప్లానింగ్శాఖలో Corruption ఉంది: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2022-05-16T22:24:33+05:30 IST
ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి (Corruption) ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) తెలిపారు.

అమరావతి: ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి (Corruption) ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్, ఏసీబీ ఫైల్స్ చూస్తే ఎక్కువ కేసులు టౌన్ ప్లానింగ్ మీదే ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల తీరు మారాలని సూచించారు. కర్నూలు జిల్లాకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని తెలిపారు. కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వస్తోందని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.