బీజేపీ ప్రతీ చర్యకు రియాక్షన్ ఉంటుంది: Sailajanath
ABN , First Publish Date - 2022-06-17T20:32:52+05:30 IST
బీజేపీ చేసే ప్రతీ చర్యకూ రియాక్షన్ ఉంటుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు.

అమరావతి: బీజేపీ చేసే ప్రతీ చర్యకూ రియాక్షన్ ఉంటుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు శైలజానాథ్(Sailajanath) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi), కేంద్రం మంత్రి అమిత్ షా(Amit shah)ల వికృత రాజకీయ క్రీడను దేశమంతా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఎఫ్ఐఆర్ కూడా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులు విచారించారని మండిపడ్డారు. దేశంలో సమస్యలను డైవర్షన్ చేయడానికే రాహుల్ గాంధీని విచారించారని ఆరోపించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. ఆశేతు హిమాచలం రాహుల్ పర్యటిస్తే బీజేపీ పక్కటెముకలు విరుగుతాయని వ్యాఖ్యానించారు. తక్షణమే రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు వెనక్కి తీసుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.