ముఖ్యమంత్రి స్థాయిలో చిల్లర మాటలా?: Sailajanath
ABN , First Publish Date - 2022-04-09T19:29:05+05:30 IST
రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మగా మారారని పీసీసీ చీఫ్ శైలజనాథ్ అన్నారు.

అమరావతి: రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మగా మారారని పీసీసీ చీఫ్ శైలజనాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి స్థాయిలో చిల్లర మాటలా? అని మండిపడ్డారు. వెంట్రుక పీకలేరంటున్న జగన్ రెడ్డికి గుండు కొట్టించి సున్నపు బొట్లు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రిపై గవర్నర్ స్పందించాలన్నారు. విద్యుత్ కోతలతో రాష్టాన్ని అంధకారం చేస్తారా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అటకెక్కిస్తారా అని నిలదీశారు. జగన్ రెడ్డి- మంత్రి బాలినేని విద్యుత్ దొంగలన్నారు. కొత్త మంత్రులు వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తెలిపారు. వీధుల్లో పోరాటాలు.. హస్తినలో సాష్టాంగ నమస్కారాలు అంటూ శైలజనాథ్ యెద్దేవా చేశారు.