పాఠశాలలో పాముల కలకలం
ABN , First Publish Date - 2022-08-04T08:26:19+05:30 IST
పాఠశాలలో పాముల కలకలం
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం జెడ్పీ హైస్కూల్‌లో విషపూరిత పాములు కలకలం రేపాయి. భారీ వర్షాలకు పాఠశాల ప్రాంగణంలో నీరు నిలిచింది. బుధవారం విద్యార్థులు పాఠశాలకు వెళ్లేసరికి మూడు పాములు సంచరిస్తూ కనిపించాయి. దీంతో వారు భయపడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాలకు వద్దకు చేరుకుని ఉపాద్యాయులతో కలిసి పాములను చంపేశారు. - పెనుకొండ రూరల్