Comedian Ali: జగన్ మరోసారి సీఎం అయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తా

ABN , First Publish Date - 2022-09-29T02:03:44+05:30 IST

తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీ (ycp) ని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేస్తున్నారు.

Comedian Ali: జగన్ మరోసారి సీఎం అయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తా

అమరావతి: తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీ (ycp) ని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేస్తున్నారు. కొన్ని రోజులుగా అలీ వైసీపీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో చేరింది పదవుల కోసం కాదని, జగన్‌ (jagan)ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానం ముఖ్యమన్నారు. జగన్ మరోసారి సీఎం అయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తానని అలీ స్పష్టం చేశారు. 


అనూహ్య పరిణామాల మధ్య నటుడు అలీ (Ali) వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలో భాగంగా అది కుదరలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ముచ్చట తీరలేదు. తీరా.. అలీని రాజ్యసభ (Rajya Sabha)కు పంపడం ఖాయమని వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. అక్కడ కూడా ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఏపీ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఈ లిస్టులో అలీ లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని అలీ వెల్లడించారు.



‘‘జగన్ దృష్టిలో నేను ఉన్నాను. భవిష్యత్‌లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా. నీకు ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదు, ఏదో ఒక పదవి ఇస్తామని గట్టిగా చెప్పారు. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్‌ బోర్డు చైర్మన్ పదవి కూడా నాకు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్ళకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి ఒకరోజు పిలుపు వస్తుంది. ఆరోజు మీడియా ముందుకు వస్తాను’’ అని అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more