ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
ABN , First Publish Date - 2022-02-06T09:13:46+05:30 IST
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
ప్రధానికి పదివేల పోస్ట్ కార్డులు పంపనున్న సీపీఎం
భద్రాచలం, ఫిబ్రవరి 5: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఆయనకు పదివేల పోస్టుకార్డులను పంపే ఉద్యమాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్ శనివారం ప్రారంభించారు. కాగా.. భద్రాచలం పట్టణంలో అంతర్భాగమైన తమ కాలనీని విభజనలో ఆంధ్రాలో కలపటం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రాజుపేట కాలనీవాసులు సీపీఎం నేతల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.