చేయి వదలండి.. లేదంటే లోపలేయిస్తా!

ABN , First Publish Date - 2022-10-11T09:50:13+05:30 IST

తమకు పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగిన రిజర్వాయర్‌ ముంపు నిర్వాసిత రైతులపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ రిజర్వాయర్‌

చేయి వదలండి.. లేదంటే లోపలేయిస్తా!

రైతులపై పుట్టపర్తి కలెక్టర్‌ ఆగ్రహం 

ఓ రైతు చేయి తాకారని అసహనం


పుట్టపర్తి, అక్టోబరు 10: తమకు పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగిన రిజర్వాయర్‌ ముంపు నిర్వాసిత రైతులపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభు త్వం నిర్ణయించింది. మండలంలోని పొడరాళ్లపల్లి, గోపాలపురం, రామసాగరం గ్రామాలు ముంపు బారిన పడనున్నాయి. దీంతో ఆ గ్రామాల రైతులు సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్‌ ఎదుట తమకు పరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ బయటకు వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికొచ్చి పరిశీలించాలని కలెక్టర్‌ చేయిని ఒకరు పట్టుకున్నారు. అప్పటికే రైతుల ఆందోళనపై అసహనంతో ఉన్న ఆయన.. ‘చేయి వదలండి.. లేదంటే లోపలేయిస్తా..’ అంటూ మండిపడ్డారు. ఎవరికీ అన్యాయం జరగదంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read more