బూతుల మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి: దేవినేని
ABN , First Publish Date - 2022-01-28T01:20:12+05:30 IST
సంక్రాంతి సంబరాల ముసుగులో పేకాట, వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం చేసి మంత్రి పదవికి, తెలుగు ప్రజలకు కళంకం తెచ్చిన కొడాలి నానిపై
నందిగామ: సంక్రాంతి సంబరాల ముసుగులో పేకాట, వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం చేసి మంత్రి పదవికి, తెలుగు ప్రజలకు కళంకం తెచ్చిన కొడాలి నానిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుడివాడలో మంత్రి కె కన్వెన్షన్ వద్ద గోవా నుంచి అమ్మాయిలు, డ్రగ్స్‌ను తెచ్చి ఇక్కడ వ్యాపారం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పేకాట, గుండాటల వద్ద మహిళలతో నృత్యాలు చేయించడంతో పాటు గుడివాడలోని పలు హోటళ్లలో వ్యభిచారం చేయించారని ఆరోపించారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇవన్నీ జరిగినట్టు ఆధారాలు బయటకు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, పార్టీ నిజనిర్థారణ కమిటీపైనా బూతుల మంత్రి నోరు పారేసుకున్నాడని మండిపడ్డారు. గౌరవ ప్రదమైన మంత్రి పదవిలో ఉండి డబ్బు కోసం ఇంత నీచానికి దిగిన చరిత్ర కొడాలిదేనన్నారు. చంద్రబాబుపై వాడుతున్న భాషను ప్రజలు గమనిస్తున్నారని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.