కోటి మంది అక్కాచెల్లెమ్మల చేతిలో దిశా యాప్‌లు: సీఎం Jagan

ABN , First Publish Date - 2022-03-23T15:51:40+05:30 IST

రాష్ట్రంలో 1.16కోట్ల మంది అక్కాచెల్లెమ్మల చేతిలో దిశా యాప్‌లు ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

కోటి మంది అక్కాచెల్లెమ్మల చేతిలో దిశా యాప్‌లు: సీఎం Jagan

అమరావతి: రాష్ట్రంలో 1.16కోట్ల మంది అక్కాచెల్లెమ్మల చేతిలో దిశా యాప్‌లు ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బుధవారం ఉదయం 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... గతంలో పోలీస్ స్టేషన్లలో మహిళలకు బాత్ రూంలు ఉండేవే కాదన్నారు. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌లో వారికి ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ పోలీస్ చెల్లెమ్మ అయినా తాను డ్యూటీలో ఇబ్బంది పడకుండా మొబైల్ రెస్ట్ రూమ్‌ల వాహనాలు ప్రారంభించామని చెప్పారు. ప్రమాదంలో ఉన్నా అని చేతిలో సెల్ ఫోన్ 5 సార్లు ఊపితే  10 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వెళతారని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Read more