AP News: వరద నష్టంపై కేంద్రానికి జగన్‌ పంపిన వివరాలు తప్పుల తడక: పట్టాభి

ABN , First Publish Date - 2022-07-30T21:50:41+05:30 IST

వరద నష్టంపై కేంద్రానికి సీఎం జగన్‌ (CM Jagan) పంపిన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి

AP News: వరద నష్టంపై కేంద్రానికి జగన్‌ పంపిన వివరాలు తప్పుల తడక: పట్టాభి

అమరావతి: వరద నష్టంపై కేంద్రానికి సీఎం జగన్‌ (CM Jagan) పంపిన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి (Pattabhi) తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 గృహాలు మాత్రమే ధ్వంసమయ్యాయని, కేంద్రానికి నివేదిక పంపడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. 15వేల గృహాలు ధ్వంసమైనట్లు తెలంగాణకు ఎన్డీఎంఏకు నివేదిక పంపిందని తెలిపారు. ఏపీలో కేవలం 26వేల ఎకరాల పంట నష్టం జరిగిందని రిపోర్ట్ పంపారని, వాస్తవంగా 60వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పట్టాభి పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలోని నదీ పరీవాహక లంక గ్రామాలు వరద వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఆ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేకమంది జ్వరాలు, జలుబుతో బాధపడుతున్నారు. వరద ముప్పు నుంచి తేరుకుంటున్న గ్రామాల్లో బురద కష్టాలు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2022-07-30T21:50:41+05:30 IST