CM Jagan: పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నాం
ABN , First Publish Date - 2022-08-16T19:55:41+05:30 IST
జిల్లాలోని అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పర్యటించారు.

అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏటీసీ టైర్ల పరిశ్రమ (ATC Tires Industry)ను ప్రారంభించారు. 8 పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా చిన్న పారిశ్రామిక సంస్థలున్నాయన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ (GDP) వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. 15 నెలల్లోనే టైర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో రెండో ఫేజ్‌కు ముందుకొచ్చారని... 2023 ఆగస్ట్ నాటికి రెండో ఫేజ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మూతబడిన ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.